కోహ్లిని ఆకాశానికి ఎత్తేసిన పాక్‌ దిగ్గజం

Virat Kohli Can Play Until 44 And Break Sachin Tendulkar's Century Record - Sakshi

కరాచీ: ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌లో 50 శతకాల్ని భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. శ్రీలంకతో కోల్‌కతా జరిగిన టెస్టులో సెంచరీ చేయడంతో కోహ్లి సెంచరీల హాఫ్‌ సెంచరీ కొట్టాడు. ప్రపంచ క్రికెట్‌ లో పరుగుల మెషీన్‌ గా మారిన కోహ్లిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌..విరాట్‌ను ఆకాశానికి ఎత్తేశాడు.
 

'విరాట్ కోహ్లి ఆధునిక క్రికెట్ లో గొప్ప ఆటగాడు. ఛేజింగ్‌లో ఇన్నింగ్స్ నిర్మించడంలో అతడికి ఎవరూ సాటిలేరు. అతడిప్పటికే 50 సెంచరీలు సాధించాడు. సచిన్ రికార్డును బ్రేక్ చేసే ఏకైక ఆటగాడు కోహ్లి మాత్రమే. ఇక్కడ సచిన్‌ తో కోహ్లిని పోల్చడం లేదు. సచిన్‌ ఆల్‌ టైమ్‌ గ్రేట్‌. ఇప్పటి శకంలో కోహ్లి ఒక గొప్ప బ్యాట్స్‌మన్‌.  అతడిపై ఎలాంటి ఒత్తిడి లేదు. విరాట్ ఆటను ఆస్వాదిస్తున్నాడు.మిస్బా ఉల్ హక్ 43 ఏళ్లు వచ్చే వరకూ ఆడితే.. విరాట్ 44 ఏళ్లు వచ్చే వరకూ కచ్చితంగా ఆడతాడు. విరాట్ సుదీర్ఘ కాలంపాటు క్రికెట్ ఆడగలడు. కోహ్లి 120 సెంచరీలు చేయగలడు’ అని షోయబ్ అక్తర్ జోస్యం చెప్పాడు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top