డిస్కస్ త్రోలో వికాస్ గౌడకు రజతం | Vikas Gowda claims discus throw silver | Sakshi
Sakshi News home page

డిస్కస్ త్రోలో వికాస్ గౌడకు రజతం

Sep 30 2014 5:10 PM | Updated on Sep 2 2017 2:11 PM

డిస్కస్ త్రోలో వికాస్ గౌడకు రజతం

డిస్కస్ త్రోలో వికాస్ గౌడకు రజతం

ఆసియా క్రీడల్లో భారత అథ్లెటిక్స్ మెరుస్తున్నారు.

ఇంచియాన్:ఆసియా క్రీడల్లో భారత అథ్లెటిక్స్ మెరుస్తున్నారు. మంగళవారం జరిగిన పురుషుల డిస్కస్ త్రో విభాగంలో వికాస్ గౌడ్ రజత పతకాన్ని చేజిక్కించుకున్నాడు. ఇంచియాన్ జరుగుతున్న ఆసియన్ గేమ్స్ డిస్కస్ త్రో ఈవెంట్ లో 62.58 మీటర్లు విసిరిన వికాస్ రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉండగా ఇరాన్ కు చెందిన ఈషాన్ హదాది 65. 11 మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని దక్కించుకోగా, ఖతార్ కు చెందిన మహ్మద్ అహ్మద్ కాంస్య పతకం లభించింది.

 

మహ్మద్ 61.25 మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచాడు. అంతకుముందు మహిళల విభాగంలో భారత్ కు చెందిన సీమా పూనియా స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement