ఐటా సింగిల్స్‌ చాంప్‌ వినీత్‌ | Vieeth Wins AITA Title First Time | Sakshi
Sakshi News home page

ఐటా సింగిల్స్‌ చాంప్‌ వినీత్‌

Nov 10 2019 10:02 AM | Updated on Nov 10 2019 10:02 AM

Vieeth Wins AITA Title First Time - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కుర్రాడు ముత్యాల వినీత్‌ అదరగొట్టాడు. తొలిసారి తెలుగు రాష్ట్రాల నుంచి బాలుర విభాగంలో అఖిల భారత టెన్నిస్‌ సంఘం సింగిల్స్‌ టైటిల్‌ని నెగ్గిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. బాలుర అండర్‌–14 విభాగంలో వినీత్‌ విజేతగా నిలిచాడు. శనివారం జరిగిన ఫైనల్‌లో వినీత్‌ 6–3, 4–6, 6–3తో సిద్ధార్థ్‌ మరాఠే (మహారాష్ట్ర)పై విజయం సాధించి టైటిల్‌ను ఖాయం చేసుకున్నాడు. తొలి సెట్‌ గెలిచిన వినీత్‌ రెండో సెట్‌లో వెనుకబడ్డాడు. అయితే నిర్ణాయక మూడో సెట్‌లో దూకుడుగా ఆడి సెట్‌తో పాటు మ్యాచ్‌నూ గెలిచాడు.    

Advertisement
 
Advertisement
Advertisement