చాంప్స్‌ వశిష్ట రమణ, నందిత | Vasista Ramana, Nandita selected to Telangana inter State Chess Champion | Sakshi
Sakshi News home page

చాంప్స్‌ వశిష్ట రమణ, నందిత

Jun 7 2018 10:20 AM | Updated on Jun 7 2018 10:20 AM

 Vasista Ramana, Nandita selected to Telangana inter State Chess Champion - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అంతర్‌ జిల్లా చెస్‌ చాంపియన్‌షిప్‌కు వశిష్ట రమణ, వి. నందిత, సశ్య, శ్రీనిథ్‌ ఎంపికయ్యారు. బాలాపూర్‌లోని విస్రా జూనియర్‌ కాలేజిలో నిర్వహించిన అండర్‌–7, అండర్‌–15 రంగారెడ్డి చెస్‌ టోర్నీలో విజేతలుగా నిలిచిన వీరు అంతర్‌ జిల్లా చెస్‌ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించారు. మంగళవారం ముగిసిన ఈ పోటీల్లో అండర్‌–7 బాలుర విభాగంలో శ్రీనిథ్‌ విజేతగా నిలవగా... ఉదయ్‌ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. బాలికల విభాగంలో సశ్య అగ్రస్థానంలో నిలిచింది. అండర్‌–15 బాలుర విభాగంలో వశిష్ట రమణ విజేతగా, అమన్‌ జాషువ రన్నరప్‌గా నిలిచారు. పవన్‌ కుమార్, శ్రీరామ్, సోహైల్‌ వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాలు దక్కించుకున్నారు. బాలికల విభాగంలో వి. నందిత టైటిల్‌ నెగ్గగా... సాయి శ్రీ చరిత వరేణ్య రన్నరప్‌గా నిలిచింది. స్నేహ సాయి శ్రావణి, మమత శ్రీ వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో నిలిచారు. వీరు ఈ నెల 8 నుంచి 10 వరకు అబిడ్స్‌లోని డైమండ్‌ జూబ్లీ హైస్కూల్‌లో నిర్వహించనున్న తెలంగాణ అంతర్‌ జిల్లా చెస్‌ టోర్నీలో పాల్గొననున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement