హిమ దాస్‌ స్వర్ణ చరిత్ర

Under-20 World Athletics: Hima Das scripts history, wins gold  - Sakshi

ప్రపంచ అండర్‌–20 అథ్లెటిక్స్‌లో బంగారు పతకం 

టాంపెరె: ప్రపంచ అండర్‌–20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి హిమ దాస్‌ కొత్త చరిత్ర సృష్టించింది. ఫిన్లాండ్‌లోని టాంపెరెలో జరుగుతున్న ఈ ఈవెంట్‌ 400 మీటర్ల పరుగులో ఆమె 51.46 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణ పతకం గెలుచుకుంది. ఐఏఏఎఫ్‌ వరల్డ్‌ ట్రాక్‌ ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌ హిమ కావడం విశేషం. 2016 చాంపియన్‌షిప్‌లో ఫీల్డ్‌ విభాగంలో నీరజ్‌ చోప్రా (జావెలిన్‌ త్రో) స్వర్ణం నెగ్గాడు.

400 మీటర్ల పరుగులో ఆండ్రియా మెక్లోస్‌ (రొమేనియా– 52.07 సె.), టేలర్‌ మ్యాన్షన్‌ (అమెరికా – 52.28 సె.) రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. అసోంలోని నాగావ్‌కు చెందిన 18 ఏళ్ల హిమ ఇటీవల గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో 400 మీటర్ల పరుగులో ఆరో స్థానంలో నిలిచింది. అయితే ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో చెలరేగి భారత అథ్లెటిక్స్‌ ప్రపంచం గర్వపడే ప్రదర్శన కనబర్చింది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top