ఒక్కటైన క్రికెట్‌ జంట! | Two Women Cricketers From Australia And New Zealand Got Married | Sakshi
Sakshi News home page

ఒక్కటైన క్రికెట్‌ లెస్బియన్‌ జంట

Apr 18 2019 8:10 PM | Updated on Apr 18 2019 8:12 PM

Two Women Cricketers From Australia And New Zealand Got Married - Sakshi

న్యూజిలాండ్‌ మహిళా క్రికెటర్‌ హలే జెన్సెన్‌, ఆస్ట్రేలియాకు చెందిన నికోలా హాన్‌కాక్‌ను పెళ్లాడారు. వారం రోజుల క్రితం ఈ క్రికెట్‌ జంట వివాహ బంధంతో ఒక్కటైనట్లు నికోలా ప్రాతినిథ్యం వహిస్తున్న మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ట్విటర్‌ ద్వారా పేర్కొంది. ఈ మేరకు... ‘ గత వారం తన భాగస్వామి హెలే జెన్సెన్‌ను పెళ్లాడిన మా స్టార్‌ బౌలర్‌ హాన్‌కాక్‌కు టీమ్‌గ్రీన్‌ తరఫున శుభాభినందనలు’ అంటూ కొత్త జంట ఫొటోను షేర్‌ చేసింది.

కాగా విక్టోరియా వుమన్‌ ప్రీమియర్‌ క్రికెట్‌ కాంపిటీషన్‌ సీజన్‌ 2017-18లో ప్రతిభ కనబరిచినందుకు గానూ ఉనా పైస్లీ మెడల్‌ పొందిన జెన్సెన్‌.. 2014లోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు. కివీస్‌ జట్టులో ఆల్‌రౌండర్‌గా ఎదిగిన ఆమె.. 2015లో జరిగిన ఓ మ్యాచ్‌లో 122 పరుగులు చేసి వుమెన్‌ క్రికెట్‌లో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందారు. ఇక ఆమె జీవిత భాగస్వామి హాన్‌కాక్‌ మహిళా బిగ్‌బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక ఆగస్టు 19, 2013 నుంచి న్యూజిలాండ్‌లో స్వలింగ వివాహాలు చట్టబద్ధమైన సంగతి తెలిసిందే. కాగా క్రికెట్‌ లెస్బియన్‌ జంట పెళ్లి చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ డేన్‌ వాన్‌ నికెర్క్, ఆల్‌రౌండర్‌ మరిజాన్‌ కాప్‌ గతేడాది వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement