నేను తప్పు చేయలేదు!  

Tushar Arothe Claims innocence Says Would Never Indulge in Such act - Sakshi

తుషార్‌ అరోథే వివరణ  

వడోదర: ఐపీఎల్‌ బెట్టింగ్‌కు పాల్పడి పోలీసుల చేతిలో అరెస్టయిన భారత మహిళల క్రికెట్‌ జట్టు మాజీ కోచ్‌ తుషార్‌ అరోథే తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించారు. తానెప్పుడూ ఎలాంటి తప్పుడు పనులకు పాల్పడలేదని ఆయన వివరణ ఇచ్చారు. బెట్టింగ్‌ అభియోగంపై తుషార్‌తో పాటు మరో 18 మందిని బరోడా పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేయగా...ఆ తర్వాత వారు బెయిల్‌పై విడుదలయ్యారు. అనంతరం ఈ ఘటనపై తుషార్‌ స్పందించారు. ‘క్రికెట్‌ నా జీవనాధారం. ఇవాళ నాకు ఈ మాత్రం పేరు వచ్చి ఈ స్థితిలో ఉన్నానంటే అందుకు క్రికెట్టే కారణం. నేనెప్పుడూ అలాంటి తప్పుడు పని చేయను. చేయడం సంగతేమో కానీ కనీసం ఆలోచించను కూడా. జీవితంలో ఒక్క పైసా విషయంలో కూడా ఎవరినీ మోసం చేయలేదు’ అని అరోథే వ్యాఖ్యానించారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top