రాష్ట్ర టగ్‌ ఆఫ్‌ వార్‌ జట్ల ప్రకటన | tug of war teams for telangana announced | Sakshi
Sakshi News home page

రాష్ట్ర టగ్‌ ఆఫ్‌ వార్‌ జట్ల ప్రకటన

Jan 12 2018 10:38 AM | Updated on Jan 12 2018 10:38 AM

tug of war teams for telangana announced - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ సీనియర్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్లను గురువారం ప్రకటించారు. పురుషుల జట్టుకు కెప్టెన్‌గా ఎన్‌. రాఘవేంద్ర, మహిళల జట్టుకు కెప్టెన్‌గా ఎ. దివ్య చౌదరి వ్యవహరించనున్నారు. మిక్స్‌డ్‌ టీమ్‌కు వి. షన్మితా రెడ్డి సారథ్యం వహించనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర పురుషుల, మహిళల జట్లకు సెక్రటేరియట్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా కార్యదర్శి బి. వెంకటేశం స్పోర్ట్స్‌ కిట్లను అందజేశారు. పంజాబ్‌లో రేపటి నుంచి ఈనెల 18 వరకు జాతీయ సీనియర్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌ చాంపియన్‌షిప్‌ జరుగనుంది.  

జట్ల వివరాలు

పురుషులు: ఎన్‌. రాఘవేంద్ర (కెప్టెన్‌), ఎ. రాజశేఖర్‌ (వైస్‌ కెప్టెన్‌), ఎస్‌. భాస్కర్, టి. కార్తీక్, జి. మధు, బి. బాలు, ఆర్‌. గోవింద్, కె. మహేశ్, పి. రాకేశ్, టి. శ్రీనివాస్‌ (కోచ్‌), దేవీ వరప్రసాద్‌ (మేనేజర్‌).  మహిళలు: ఎ. దివ్య చౌదరి (కెప్టెన్‌), వి. దివ్య (వైస్‌ కెప్టెన్‌), రసజ్ఞ, జి. అమరావతి, వి. కావ్య, ఎస్‌. శిరీష, కె. మమత, కె. సారిక, వై. శిరీష, కృష్ణారావు (కోచ్‌), సంయుక్త (మేనేజర్‌).  మిక్స్‌డ్‌ టీమ్‌: వి. షన్మితా రెడ్డి (కెప్టెన్‌), కె. కావ్య (వైస్‌ కెప్టెన్‌), ఎస్‌కే హజ్రత్, ఎస్‌కే అస్మా, జె. కేదారేశ్వరి, బి. వెంకటేశ్, పి. మహేందర్, దినకర్, ఆర్‌. శ్రీను, పి. మహేందర్, సాగర్‌ (కోచ్‌), బి. సత్య నారాయణ (మేనేజర్‌).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement