సాత్విక్‌ జంటకు టైటిల్‌ | Top seed Verma clinches home tournament win at BWF Hyderabad Open | Sakshi
Sakshi News home page

సాత్విక్‌ జంటకు టైటిల్‌

Sep 10 2018 4:07 AM | Updated on Sep 10 2018 4:07 AM

Top seed Verma clinches home tournament win at BWF Hyderabad Open - Sakshi

సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) టూర్‌ సూపర్‌–100 హైదరాబాద్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు రెండు విభాగాల్లో టైటిల్స్‌ లభించాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) ద్వయం 21–16, 21–14తో మూడో సీడ్‌ అక్బర్‌–ఇస్‌ఫహాని (ఇండోనేసియా) జంటపై నెగ్గింది. మిక్స్‌డ్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ సిక్కిరెడ్డి–ప్రణవ్‌ (భారత్‌) ద్వయం 21–15, 19–21, 23–25తో ఆరో సీడ్‌ అక్బర్‌–వినీ ఒక్తవినా (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సిక్కిరెడ్డి ద్వయం 3 మ్యాచ్‌ పాయింట్లను వదులుకోవడం గమనార్హం. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌సీడ్‌ సమీర్‌ వర్మ 21–15, 21–18తో సూంగ్‌ జూ వెన్‌ (మలేసియా)పై గెలిచి టైటిల్‌ సొంతం చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement