సిరీస్‌ కోల్పోతామనే  బెంగ లేదు!

Tim Paine and co has a lot at stake in the ongoing series against India - Sakshi

టిమ్‌ పైన్‌ వ్యాఖ్య 

సిడ్నీ: నాలుగో టెస్టులో భారత్‌ గెలిచినా లేదా ‘డ్రా’ చేసుకున్నా ఆస్ట్రేలియా గడ్డపై తొలి సిరీస్‌ విజయమవుతుంది. స్వదేశంలో టీమిండియాకు సిరీస్‌ కోల్పోయిన మొదటి ఆసీస్‌ కెప్టెన్‌గా టిమ్‌ పైన్‌ ఖాతాలో చెత్త రికార్డు చేరుతుంది. అయితే తాను దాని గురించి అతిగా ఆలోచించడం లేదని, జట్టు మెరుగైన ప్రదర్శన కనబర్చడంపైనే దృష్టి పెట్టినట్లు పైన్‌ చెబుతున్నాడు.

‘మా ఆటను మెరుగుపర్చుకొని సాధ్యమైనంత ఉత్తమ ప్రదర్శన ఇవ్వడం ముఖ్యం. మేం కూడా ప్రతీ టెస్టు గెలవాలని కోరుకుంటాం. కానీ అది సాధ్యం కాదు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ జట్టును ఎదుర్కొంటున్నాం. సిరీస్‌ కోల్పోవడం గురించి నేను ఎక్కువగా ఆలోచించలేదు. మా ఆటను బాగుపర్చడం, భారత్‌కు గట్టి పోటీనివ్వడమే ప్రస్తుతం నా లక్ష్యం’ అని పైన్‌ పేర్కొన్నాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top