ఇదే నా బెస్ట్ బ్రేక్ఫాస్ట్: సచిన్ | this is my best break fast, says sachin | Sakshi
Sakshi News home page

ఇదే నా బెస్ట్ బ్రేక్ఫాస్ట్: సచిన్

Jul 3 2017 11:27 AM | Updated on Sep 5 2017 3:06 PM

ఇదే నా బెస్ట్ బ్రేక్ఫాస్ట్: సచిన్

ఇదే నా బెస్ట్ బ్రేక్ఫాస్ట్: సచిన్

తన కుమారడు అర్జున్ టెండూల్కర్ తయారు చేసిన బ్రేక్ ఫాస్ట్ ను చూసి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తెగి మురిసిపోతున్నాడు.

ముంబై: తన కుమారడు అర్జున్ టెండూల్కర్ తయారు చేసిన బ్రేక్ ఫాస్ట్ ను చూసి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తెగి మురిసిపోతున్నాడు. అర్జున్ తయారు చేసిన బ్రేక్ ఫాస్ట్ ఎంతబాగుందో అంటూ అర్జున్ని పొగడ్తలతో ముంచుత్తుతున్నాడు. ఈ మేరకు అర్జున్ చేసిన బ్రేక్ ఫాస్ట్ ను బెడ్ పైనే ఉండి తింటుండగా తీసిన ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు సచిన్.

 

'మా అబ్బాయి తయారు చేసిన బ్రేక్ ఫాస్ట్ ఇది.. ఎప్పటికీ ఇదే నా బెస్ట్ బ్రేక్ ఫాస్ట్'అని సచిన్ క్యాప్షన్ జోడించాడు. తనదైనందిన విశేషాలను సోషల్ మీడియా ద్వారా పంచుకునే సచిన్.. తాజాగా కుమారుడు చేసిన బ్రేక్ ఫాస్ట్ ను సైతం ఫోటో తీసి అభిమానులతో పంచుకోవడం విశేషం.


 

 

Breakfast in bed cooked by my son Arjun :-) best breakfast ever!!!

A post shared by Sachin Tendulkar (@sachintendulkar) on

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement