సారీ చెప్పాల్సిన అవసరం లేదు: సర్ఫరాజ్‌

There is no need to say sorry, Sarfaraz Ahmed - Sakshi

కరాచీ: ప్రస్తుత వరల్డ్‌కప్‌లో తమ ప్రదర్శన మరీ అంత చెత్తగా ఏమీ  లేదని పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ సర్పరాజ్‌ అహ్మద్‌ పేర్కొన్నాడు. తమ జట్టు సెమీ ఫైనల్‌ రేసులో నిలవలేకపోయినా ఆకట్టుకుందనే విషయం అందరికీ తెలసన్నాడు. ప్రధానంగా భారత్‌పై ఓటమి తర్వాత తమ తిరిగి పుంజుకున్న తీరు అమోఘమంటూ జట్టు సభ్యులపై ప్రశంసలు కురింపించాడు. ఒకవేళ తాము సెమీ ఫైనల్‌కు వెళ్లనుందుకు ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం కూడా లేదన్నాడు.

వరల్డ్‌కప్‌ను లీగ్‌ దశలోనే ముగించి స్వదేశానికి చేరుకున్న క్రమంలో కరాచీలో ఏర్పాటు చేసిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో సర్పరాజ్‌ మాట్లాడాడు. ‘ మా ప్రదర్శన చెత్తగా ఉందని ఎవరైనా అభిప్రాయపడితే అది తప్పు. మేము భారత్‌పై ఓటమి చెందిన తర్వాత పూర్తి స్థాయి ప్రదర్శనతో వరుస విజయాలు సాధించాం. అయినా అదృష్టం కలిసి రాక టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అటువంటప్పుడు మేము ఎవరికి క్షమాపణలు చెప్పాలి. అసలు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. మా శాయ శక్తుల ప్రయత్నించాం. మేము 2 నుంచి 4 పాయింట్లతో స్వదేశానికి రాలేదు. మేము 11 పాయింట్లు సాధించాం. దాంతో మా ప్రదర్శన బాగుందనే విషయం అంతా అంగీకరించాలి’ అని సర్పరాజ్‌ తెలిపాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top