విజేత హారిక | The winner was the winner of seven points in the women's section | Sakshi
Sakshi News home page

విజేత హారిక

Apr 28 2017 11:27 PM | Updated on Sep 5 2017 9:55 AM

విజేత హారిక

విజేత హారిక

రెక్జావిక్‌ ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక అగ్రస్థానాన్ని సంపాదించింది.

హైదరాబాద్‌: రెక్జావిక్‌ ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక అగ్రస్థానాన్ని సంపాదించింది. ఐస్‌లాండ్‌లోని రెక్జావిక్‌ పట్టణంలో ముగిసిన ఈ టోర్నీలో హారిక మహిళల విభాగంలో ఏడు పాయింట్లతో విజేతగా నిలిచింది. జాకబ్‌ ఫ్రెయుండ్‌ (జర్మనీ)తో జరిగిన చివరిదైన పదో రౌండ్‌ గేమ్‌లో హారిక 44 ఎత్తుల్లో విజయం సాధించింది.

ఓవరాల్‌గా ఈ టోర్నీలో హారిక ఆరు గేముల్లో గెలిచి, రెండింటిలో ఓడి, మరో రెండింటిని ‘డ్రా’గా ముగించింది. ఇదే టోర్నీ అండర్‌–12 విభాగంలో భారత్‌కే చెందిన ప్రజ్ఞానంద టైటిల్‌ సాధించాడు.

Advertisement
 
Advertisement
Advertisement