క్వార్టర్స్‌లో దేవేంద్రో సింగ్ | The second seed Manoj win | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో దేవేంద్రో సింగ్

Jun 21 2016 12:26 AM | Updated on Sep 4 2017 2:57 AM

క్వార్టర్స్‌లో దేవేంద్రో సింగ్

క్వార్టర్స్‌లో దేవేంద్రో సింగ్

ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్ లైష్రామ్ దేవేంద్రో సింగ్...

 రెండో సీడ్‌పై మనోజ్ గెలుపు
 
బాకు (అజర్‌బైజాన్): ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్ లైష్రామ్ దేవేంద్రో సింగ్ (49 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. మరోవైపు మనోజ్ కుమార్ (64 కేజీలు) రెండో సీడ్‌పై సంచలన విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీల తొలి రౌండ్‌లో ‘బై’ లభించిన దేవేంద్రో రెండో రౌండ్‌లో 3-0తో లియాండ్రో బ్లాంక్ (అర్జెంటీనా)ను ఓడిం చాడు.

ఒలింపిక్ బెర్త్ దక్కించుకోవాలంటే అతను ఫైనల్‌కు చేరాల్సి ఉంటుంది. అటు మనోజ్ అద్భుత ప్రదర్శనతో రెండో సీడ్ మొహమ్మద్ ఇస్లాం అహ్మద్ అలీ (ఈజిప్టు)పై 3-0తో నెగ్గాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీ నుంచి దక్కే 39 ఒలింపిక్ బెర్త్‌ల కోసం 400 మంది బాక్సర్లు బరిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement