బహ్రెయిన్ వేదికగా జరుగుతున్న ఆసియా యూత్ గేమ్స్ మూడో ఎడిషన్‌లో భారత బాక్సర్లు సత్తాచాటారు. ఈ పోటీల్లో భారత యువ బాక్సింగ్ బృందం ఐదు పతకాలు సాధించింది. అందులో మూడు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్య పతకం ఉంది. గురువారం
గురువారం ఉదయం జరిగిన తొలి ఫైనల్(46 కేజీల విభాగం)లో భారత బాక్సర్ ఖుషీ చంద్.. చైనాకు చెందిన లూ జిన్క్సియుపై 4:1 తేడాతో ఓడించి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత 50 కేజీల విభాగంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు చెందిన మా జోంగ్ హ్యాంగ్‌తో జరిగిన బౌట్ తొలి రౌండ్‌లోనే 'రిఫరీ స్టాప్‌డ్ కాంటెస్ట్' (RSC) ద్వారా అహానా శర్మ విజయం సాధించింది.
దీంతో భారత ఖాతాలో రెండు గోల్డ్‌మెడ్ చేరింది. ఇక 54 కేజీల ఈవెంట్‌లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ముహమ్మదోవా కుమ్రినీసోపై 5:0 తేడాతో విజయం సాధించిన చంద్రిక భోరేషి పూజారి.. గోల్డ్‌మెడల్‌ను కైవసం చేసుకుంది.


