టి20ల్లో థాయ్‌ అమ్మాయిల ప్రపంచ రికార్డు

Thailand Women break T20I record with 17th successive win - Sakshi

వరుసగా 17వ విజయం  

దుబాయ్‌: థాయ్‌లాండ్‌ మహిళల క్రికెట్‌ జట్టు అంతర్జాతీయ టి20ల్లో కొత్త రికార్డు సృష్టించింది. వరుసగా 17వ విజయంతో ఆసీస్‌ పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది. నెదర్లాండ్స్‌లో జరుగుతున్న నాలుగు దేశాల టి20 టోర్నీలో థాయ్‌ జట్టు ఆతిథ్య జట్టును 54 పరుగులకే ఆలౌట్‌ చేసింది. అనంతరం స్వల్పలక్ష్యాన్ని కేవలం 8 ఓవర్లలోనే ఛేదించింది. ఇది థాయ్‌లాండ్‌ అమ్మాయిలకు వరుసగా 17వ విజయం. ఈ నాలుగు దేశాల టోర్నీలో ఐర్లాండ్, స్కాట్లాండ్‌ మిగతా జట్లు... కాగా గత ఏడాది జూలైలో యూఏఈని ఓడించడం ద్వారా థాయ్‌లాండ్‌ జైత్రయాత్ర మొదలైంది. ఇప్పటి వరకు ఆసీస్‌ మహిళలు 2014–15 సీజన్‌లో 16 వరుస విజయాలతో రికార్డు సృష్టించగా ఇప్పుడు థాయ్‌ జట్టు ఆ రికార్డును చెరిపేసింది. అత్యధిక వరుస విజయాల జాబితాలో థాయ్, ఆసీస్‌ తర్వాత ఇంగ్లండ్, జింబాబ్వే మహిళల జట్లు 14 విజయాలతో నిలువగా, న్యూజిలాండ్‌ 12 విజయాలతో టాప్‌–5లో ఉంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top