
భారత్‌తో టెస్టు కోసం మదర్సా మూసివేత
భారత క్రికెట్ జట్టు పర్యటన కోసం బంగ్లాదేశ్ కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటోంది. దీంట్లో భాగంగా స్థానిక ఫతుల్లా స్టేడియానికి...
బంగ్లాదేశ్ నిర్ణయం
ఢాకా : భారత క్రికెట్ జట్టు పర్యటన కోసం బంగ్లాదేశ్ కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటోంది. దీంట్లో భాగంగా స్థానిక ఫతుల్లా స్టేడియానికి సమీపంలో ఉన్న ఇస్లామిక్ శిక్షణ సంస్థను మూసివేయించింది. అలాగే స్టాండ్స్‌లో రెచ్చగొట్టే బ్యానర్లను నిషేధించింది. ఈనెల 10 నుంచి 14 వరకు జరిగే ఏకైక టెస్టు కోసం తమ మదర్సాను మూసివేయాల్సిందిగా అధికారుల నుంచి లేఖ అందిందని మత శిక్షకుడు మౌలానా అబ్దుస్ షకూర్ అన్నారు. ప్రభుత్వం నుంచి ఇలాంటి లేఖ అందడం ఇదే తొలిసారని చెప్పారు. తొమ్మిదేళ్ల తర్వాత ఈ మైదానంలో టెస్టు క్రికెట్ జరుగబోతోంది.