తెలంగాణ పోలీస్‌ జట్టుకు టైటిల్‌ | Telangana Police Team Gets Volley Ball Title | Sakshi
Sakshi News home page

తెలంగాణ పోలీస్‌ జట్టుకు టైటిల్‌

Dec 3 2019 10:05 AM | Updated on Dec 3 2019 10:05 AM

Telangana Police Team Gets Volley Ball Title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన వాలీబాల్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ జట్టు విజేతగా నిలిచింది. ముషీరాబాద్‌ వాలీబాల్‌ గ్రౌండ్‌లో సోమవారం జరిగిన ఫైనల్లో తెలంగాణ పోలీస్‌ 25–23, 25–20, 25–22తో గాంధీనగర్‌ జట్టుపై విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

అంతకుముందు జరిగిన సెమీస్‌ మ్యాచ్‌ల్లో తెలంగాణ పోలీస్‌ 25–20, 25–16, 25–19తో ఎల్బీ స్టేడియంపై గెలుపొందగా... గాంధీనగర్‌ జట్టు 20–25, 25–21, 25–19తో జీవైసీ జట్టును ఓడించింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో వాలీబాల్‌ సీనియర్‌ కోచ్‌ నర్సింగ్‌ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీని అందజేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement