భారత సైక్లింగ్‌ జట్టులో తనిష్క్‌ | Tanishq In In Indian Cycling Team | Sakshi
Sakshi News home page

భారత సైక్లింగ్‌ జట్టులో తనిష్క్‌

Sep 7 2019 10:07 AM | Updated on Sep 7 2019 10:07 AM

Tanishq In In Indian Cycling Team - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యూసీఐ క్లాస్‌–1 ఆసియా కప్‌ సైక్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జూనియర్‌ పురుషుల జట్టుకు తెలంగాణ సైక్లిస్ట్‌ ఎం. తనిష్క్‌ ఎంపికయ్యాడు. జాతీయ స్థాయి టోర్నీల్లో నిలకడగా రాణిస్తూ పతకాలు సాధిస్తున్న తనిష్క్‌.. ఆసియా కప్‌ టోరీ్నలో భారత స్పోర్ట్స్‌ అథారిటీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు.

తాజాగా జరిగిన జాతీయ రోడ్‌ అండ్‌ ట్రాక్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించిన తనిష్క్‌ రెండు స్వర్ణాలతో మెరిశాడు. అతను యూసీఐ ప్రపంచ సైక్లింగ్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement