బీసీసీఐని ఆర్టీఐ పరిధిలోకి తీసుకురండి: లా కమిషన్‌ 

Take BCCI under RTI: Law Commission - Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి తీసుకురావాలని ‘లా’ కమిషన్‌ ప్రతిపాదించింది. అది ప్రజా అధికారమని కమిషన్‌ స్పష్టం చేసింది. దీని వల్ల క్రికెట్‌లో బీసీసీఐ గుత్తాధిపత్యం తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ‘ప్రజా పరిశీలన పరిధిలోకి తీసుకొస్తే జవాబుదారీతనం పెరుగుతుంది.

ఇలాంటి వాతావరణాన్ని పోత్సహించేందుకు తోడ్పడుతుంది’ అని లా కమిషన్‌ బుధవారం తెలిపింది. బీసీసీఐని సమాచార హక్కు చట్టం కిందకు తేవాలనుకుంటున్నారా అని 2016 జూలైలో సుప్రీం కోర్టు లా కమిషన్‌ను ప్రశ్నించిన విషయం తెలిసిందే. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top