గుర్బాజ్‌పై వేటు | Suspended on gurbaj | Sakshi
Sakshi News home page

గుర్బాజ్‌పై వేటు

Aug 11 2015 12:24 AM | Updated on Sep 3 2017 7:10 AM

గుర్బాజ్‌పై వేటు

గుర్బాజ్‌పై వేటు

సీనియర్ హాకీ ఆటగాడు గుర్బాజ్ సింగ్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించారు.

న్యూఢిల్లీ: సీనియర్ హాకీ ఆటగాడు గుర్బాజ్ సింగ్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించారు. జట్టులో విభేదాలు సృష్టిస్తుండడంతో పాటు తనలో క్రమశిక్షణ లేదని హాకీ ఇండియా (హెచ్‌ఐ) ఈ నిర్ణయం తీసుకుంది. గత నెల బెల్జియంలో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ అనంతరం హెచ్‌ఐకి సమర్పించిన నివేదికలో గుర్బాజ్‌పై ఈమేరకు ఫిర్యాదు అందింది. సోమవారం హర్బీందర్ సింగ్ నేతృత్వంలోని హెచ్‌ఐ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది.

అయితే ఈ వేటుపై గుర్బాజ్ నెలరోజుల్లో హెచ్‌ఐ అప్పీలెట్ ట్రి బ్యునల్‌కు వెళ్లే అవకాశం ఉంది. ‘నేటి నుంచి తొమ్మిది నెలల పాటు గుర్బాజ్‌ను సస్పెండ్ చేస్తున్నాం. దీంతో 2016, మే 9 వరకు అతడు భారత జట్టుకు ఆడలేడు. జూడ్ ఫెలిక్స్ అందించిన నివేదికను అనుసరించి మేం ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని హర్బీందర్ తెలిపారు. గతంలో కోచ్‌గా పనిచేసిన మైకేల్ నాబ్స్‌తో కూడా గొడవ పడి లండన్ ఒలింపిక్స్ అనంతరం కొద్ది కాలం గుర్బాజ్ సస్పెండ్‌కు గురయ్యాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement