ఆసియా క్రీడలకు సుశీల్ దూరం | Sushil Kumar opts out of Asian Games | Sakshi
Sakshi News home page

ఆసియా క్రీడలకు సుశీల్ దూరం

Aug 14 2014 1:56 AM | Updated on Sep 2 2017 11:50 AM

ఆసియా క్రీడలకు సుశీల్ దూరం

ఆసియా క్రీడలకు సుశీల్ దూరం

భారత స్టార్ రెజ్లర్ సుశీల్‌కుమార్ వచ్చే నెలలో జరగనున్న ఆసియా క్రీడలతోపాటు ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.

న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ సుశీల్‌కుమార్ వచ్చే నెలలో జరగనున్న ఆసియా క్రీడలతోపాటు ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత అయిన సుశీల్.. 2016లో రియో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే లక్ష్యంగా సిద్ధమయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) వెల్లడించింది.

ఆసియా క్రీడలకు రెజ్లింగ్ జట్టును బుధవారం ప్రకటించిన డబ్ల్యుఎఫ్‌ఐ.. సుశీల్ స్థానంలో నర్సింగ్ పంచమ్ యాదవ్‌కు చోటు కల్పించింది. ఏడుగురు సభ్యుల ఫ్రీ స్టయిల్ జట్టుకు యోగేశ్వర్‌దత్ సారథ్యం వహించనున్నాడు. మహిళల జట్టు ఎంపిక కోసం గురువారం లక్నోలో ట్రయల్స్ జరగనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement