రైనా పెళ్లి సందడి మొదలు | Suresh Raina to tie nuptial knot on Friday | Sakshi
Sakshi News home page

రైనా పెళ్లి సందడి మొదలు

Apr 2 2015 11:10 AM | Updated on Sep 2 2017 11:42 PM

రైనా పెళ్లి సందడి మొదలు

రైనా పెళ్లి సందడి మొదలు

భారత క్రికెటర్ సురేశ్ రైనా పెళ్లి సందడి మొదలైంది. తన బాల్య స్నేహితురాలు ప్రియాంక చౌదరితో శుక్రవారం సాయంత్రం లీలా ప్యాలెస్ హోటల్లో రైనా వివాహం జరగనుంది.

న్యూఢిల్లీ: భారత క్రికెటర్ సురేశ్ రైనా పెళ్లి సందడి మొదలైంది. తన బాల్య స్నేహితురాలు ప్రియాంక చౌదరితో శుక్రవారం సాయంత్రం లీలా ప్యాలెస్ హోటల్లో రైనా వివాహం జరగనుంది. బుధవారం ఘజియాబాద్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ స్టార్ క్రికెటర్ బుధవారం వరకు షాపింగ్ చేస్తూనే ఉన్నాడు.

 

‘పెళ్లికి సంబంధించిన రకరకాల వేడుకలలో ధరించే దుస్తుల కోసం ఇంకా షాపింగ్ చేస్తూనే ఉన్నాను. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాత సమయం తక్కువగా ఉండటంతో పనులు పూర్తికాలేదు’ అని రైనా చెప్పాడు. మరోవైపు భారత క్రికెటర్లంతా రైనా పెళ్లికి హాజరయ్యే అవకాశం ఉంది. కోహ్లి, అనుష్క ఇప్పటికే ఢిల్లీ చేరారు. ఉమేశ్ యాదవ్ కూడా భార్యతో పాటు ఢిల్లీ వచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement