వైభవంగా రైనాపెళ్లి | suresh raina knot with priyanka | Sakshi
Sakshi News home page

వైభవంగా రైనాపెళ్లి

Apr 4 2015 12:34 AM | Updated on Sep 2 2017 11:48 PM

వైభవంగా రైనాపెళ్లి

వైభవంగా రైనాపెళ్లి

భారత స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా ఓ ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు ప్రియాంకను శుక్రవారం రాత్రి రైనా వివాహం చేసుకున్నాడు.

ధోని, శ్రీనివాసన్ హాజరు
 
 న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా ఓ ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు ప్రియాంకను శుక్రవారం రాత్రి రైనా వివాహం చేసుకున్నాడు. స్థానిక స్టార్ హోటళ్లో జరిగిన ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు క్రికెటర్లు హాజరయ్యారు. కెప్టెన్ ఎంఎస్ ధోని తన భార్య సాక్షి సింగ్‌తో రాగా ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, మైక్ హస్సీ, మోహిత్ శర్మ, సెహ్వాగ్, డ్వేన్ బ్రేవో, విరాట్ కోహ్లి, అనుష్క శర్మ, స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ తో సహ పలువురు రాజకీయ నాయకులు కూడా వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే వివాహ విందు భోజనంలో రకరకాల ఆహార పదార్థాలను వడ్డించారు. షమీ కబాబ్స్, గలావత్ కబాబ్స్, మటన్ కోర్మా, మటన్ బిర్యానీలను ప్రత్యేకంగా చేయించారు. పరాటాలో చుట్టిన కబాబ్స్‌తో పాటు ఆనియన్ రింగ్స్, ధనియా చట్నీలను అతిథులకు రుచి చూపించారు.

Advertisement
 
Advertisement
Advertisement