శ్రీశాంత్‌ను ప్రశ్నించనున్న సుప్రీం కమిటీ | supreme court appointed panel to speak to Sreesanth next | Sakshi
Sakshi News home page

శ్రీశాంత్‌ను ప్రశ్నించనున్న సుప్రీం కమిటీ

Nov 8 2013 1:13 AM | Updated on Sep 2 2017 12:23 AM

స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌పై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ మాజీ పేసర్ శ్రీశాంత్‌ను ప్రశ్నించనుంది.

 ముంబై: స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌పై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ మాజీ పేసర్ శ్రీశాంత్‌ను ప్రశ్నించనుంది. బెట్టింగ్ కేసులో ఇరుక్కున్న రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రాతో పాటు కామెంటేటర్ హర్షా భోగ్లే, ఇతరుల నుంచి కూడా వివరాలు సేకరించనుంది.
 
  ‘ఈనెల 15 నుంచి 17 వరకు ముంబైలో కమిటీ పర్యటించనుంది. ఈ సందర్భంగా ఐపీఎల్ సీవోవో సుందర్ రామన్, చిరాయు అమిన్, హర్షా భోగ్లే, అంకిత్ చవాన్, శ్రీశాంత్, హర్మీత్ సింగ్, రాజ్ కుంద్రా, విందూ దారాసింగ్‌లను సభ్యులు కలుసుకోనున్నారు’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
 

Advertisement
 
Advertisement
Advertisement