రాజ్కోట్ టెస్టుకు లైన్ క్లియర్! | Supreme Court allows cricket board BCCI to release funds for India-England Test at Rajkot starting tomorrow | Sakshi
Sakshi News home page

రాజ్కోట్ టెస్టుకు లైన్ క్లియర్!

Nov 8 2016 4:45 PM | Updated on Sep 2 2018 5:24 PM

రాజ్కోట్ టెస్టుకు లైన్ క్లియర్! - Sakshi

రాజ్కోట్ టెస్టుకు లైన్ క్లియర్!

ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో రాజ్కోట్లో బుధవారం నుంచి ఆరంభమయ్యే తొలి టెస్టు మ్యాచ్కు లైన్ క్లియరైంది.

రాజ్కోట్:ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో రాజ్కోట్లో బుధవారం నుంచి ఆరంభమయ్యే తొలి టెస్టు మ్యాచ్కు లైన్ క్లియరైంది. ఈ టెస్టు నిర్వహించడానికి అవసరమైన నిధులను విడుదల చేయడానికి సుప్రీంకోర్టు అంగీకారం తెలపడంతో బీసీసీఐలో నెలకొన్న టెన్షన్ కు పుల్ స్టాప్ పడింది.

 

లోధా కమిటీ సిఫారుసుల అమలుపై స్పష్టత వచ్చే వరకూ రాష్ట సంఘాలకు ఎటువంటి నిధులను మంజూరు చేయకూడదంటూ గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే నిధుల విడుదలపై ఆంక్షలను సడలించాలని కోరుతూ బీసీసీఐ తాజాగా పిటిషన్ దాఖలు చేసింది. ఒకవేళ నిధులు విడుదల కాకుంటే కాకుంటే ఆ టెస్టు రద్దు కావాల్సి వస్తుందని పిటిషన్ లో విన్నవించింది. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు..  బీసీసీఐ నిధులపై విధించిన ఆంక్షలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement