
ఢిల్లీ డేర్ డెవిల్స్ పై సన్ రైజర్స్ గెలుపు
ఐపీఎల్-7లో భాగంగా ఇక్కడ ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 4 పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేసింది.
దుబాయ్: ఐపీఎల్-7లో భాగంగా ఇక్కడ ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 4 పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేసింది. సన్ రైజర్స్ విసిరిన185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ ఓపెనర్లు డీ కాక్(48), మురళీ విజయ్ (52) పరుగులు చేసి చక్కటి ఆరంభాన్నిచ్చారు. అనంతరం మిడిల్ ఆర్డర్ లో పీటర్ సన్(16), దినేష్ కార్తీక్ (15) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరడంతో ఢిల్లీకి కష్టాలు మొదలైయ్యాయి. చివర్లో డుమినీ(20), మనీష్ తివారీ(23) పరుగులతో రాణించి నాటౌట్ గా మిగిలినప్పటికీ ఢిల్లీకి గెలుపును అందించడంలో విఫలమైయ్యారు.
దీంతో నిర్ణీత ఓవర్లో నాలుగు వికెట్లు నష్టానికి 180 పరుగులకు మాత్రమే చేసిన ఢిల్లీ మరో ఓటమి మూటగట్టుకుంది. సన్ రైజర్స్ బౌలర్లలో స్టెయిన్ రెండు వికెట్లు లభించగా, కేవీ శర్మ, సమీలు తలో వికెట్టు తీశారు. టాస్ గెలిచిన సన్ రైజర్స్ తొలుత బ్యాటింగ్ తీసుకుంది. ఓపెనర్లు శిఖర్ థావన్(33), ఫించ్(88), డేవిడ్ వార్నర్(58) పరుగులు చేయడంతో సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో ఒక వికెట్టు మాత్రమే కోల్పోయి 184 పరుగులు చేసింది.