‘పరీక్ష’కు హాజరైన నరైన్ | Sunil Narine Undergoes Bowling Tests in Chennai | Sakshi
Sakshi News home page

‘పరీక్ష’కు హాజరైన నరైన్

Apr 4 2015 12:47 AM | Updated on Sep 2 2017 11:48 PM

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ గురువారం చెన్నైలో బౌలింగ్ పరీక్ష పూర్తి చేసుకున్నాడు.

చెన్నై: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ గురువారం చెన్నైలో బౌలింగ్ పరీక్ష పూర్తి చేసుకున్నాడు. ఐసీసీ నుంచి క్లియరెన్స్ వచ్చినా... బీసీసీఐ నిర్వహించే పరీక్ష పాస్ కావలసిందేననే నిబంధన ఉండటంతో... కేకేఆర్ జట్టు తనని హడావుడిగా పిలిపించింది. గురువారం ఉదయం చెన్నై చేరిన నరైన్ రామచంద్ర మెడికల్ కళాశాలలోని బయోమెకానికల్ సెంటర్‌లో బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత కోల్‌కతా వెళ్లాడు. ఈ పరీక్ష ఫలితం ఎప్పుడు వచ్చేది అధికారులు వెల్లడించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement