విచిత్రం: రహానే నాలుగేస్తే.. నరైన్‌ మూడేసిండు! | Sunil Narine Hattrick Fours Against Rajasthan | Sakshi
Sakshi News home page

Apr 18 2018 10:28 PM | Updated on Apr 18 2018 10:37 PM

Sunil Narine Hattrick Fours Against Rajasthan - Sakshi

అజింక్యా రహానే, సునీల్‌ నరైన్‌

జైపూర్‌ : రాజస్తాన్‌ రాయల్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌.. సునీల్‌ నరైన్‌ వేసిన నాలుగో ఓవర్‌లో కెప్టెన్‌ రహానే వరుస బంతుల్లో నాలుగు ఫోర్లు కొట్టగా.. కోల్‌కతా ఇన్నింగ్స్‌.. కులకర్ణి వేసిన నాలుగో ఓవర్‌లోనే సునీల్‌ నరైన్‌ హ్యాట్రిక్‌ ఫోర్‌ సాధించి బదులు తీర్చుకున్నాడు. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనకు అభిమానులు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఇక రాజస్తాన్‌ 161 పరుగుల లక్ష్యం నిర్దేశించిగా.. ఈ లక్ష్య చేధనకు దిగిన కోల్‌కతా జోరుగా ఆడుతోంది. ఓపెనర్‌ క్రిస్‌లిన్‌ మూడోబంతికే క్లీన్‌బౌల్డ్‌ అయి డకౌట్‌గా వెనుదిరగగా.. మరో ఓపెనర్ నరైన్‌, ఉతప్పతో కలిసి దూకుడుగా ఆడుతున్నాడు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement