ఇంగ్లండ్‌ జట్టులో ఆ దేశ ఆటగాళ్లు ఎంతమంది? | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ జట్టులో ఆ దేశ ఆటగాళ్లు ఎంతమంది?

Published Mon, Jun 3 2019 12:28 PM

Sunil Gavaskar Trolls England Over Non English Players - Sakshi

లండన్‌ : ప్రస్తుత ఇంగ్లండ్‌ జట్టులో ఆ దేశ ఆటగాళ్లు ఎంత మంది ఉన్నారని టీమిండియా మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ ప్రశ్నించాడు. ఆ జట్టు కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ నుంచి నిన్న-మొన్న జట్టులోకి వచ్చిన జోఫ్రా ఆర్చర్‌ వరకు అందరూ ఇతర దేశ ఆటగాళ్లేనని ఎద్దేవా చేశాడు. ఇండియా టుడే నిర్వహించిన సలామ్‌ క్రికెట్‌ 2019 కార్యాక్రమంలో పాల్గొన్న గావస్కర్‌ తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

ఇంగ్లండ్‌ జట్టులో కనీసం 6 నుంచి ఏడుగురు ఆటగాళ్లు ఇతర దేశాలకు చెందినవారే ఉన్నారని, కెప్టెన్‌ మోర్గాన్‌ ఐర్లండ్‌ దేశస్థుడైతే.. ఆర్చర్‌ వెస్టిండీస్‌ ఆటగాడని గావస్కర్‌ తెలిపాడు. ఇక ప్రపంచకప్‌లో పాల్గొనబోయే భారత జట్టుకు ఉన్న సమస్యల్లా ఐదో బౌలరేనని అభిప్రాయపడ్డాడు. ఫామ్‌ కోల్పోయినట్లు కనిపిస్తున్న భారత ఓపెనర్లు దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో అదరగొడుతారని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక గావస్కర్‌ అన్నట్లు మోర్గాన్‌ ఐర్లాండ్‌, ఆర్చర్‌ వెస్టిండీస్‌ అయితే బెన్‌స్టోక్స్‌( న్యూజిలాండ్‌), టామ్‌ కరణ్‌(దక్షిణాఫ్రికా), జాసన్‌ రాయ్‌ (దక్షిణాఫ్రికా)లు నాన్‌ ఇంగ్లీష్‌ ఆటగాళ్లు కావడం గమనార్హం.

Advertisement
Advertisement