బౌలర్లు నేర్చుకోవడం లేదు | Sunil Gavaskar blasts Indian bowlers, wants Ishant out of team | Sakshi
Sakshi News home page

బౌలర్లు నేర్చుకోవడం లేదు

Jan 21 2015 12:44 AM | Updated on Oct 4 2018 6:57 PM

బౌలర్లు నేర్చుకోవడం లేదు - Sakshi

బౌలర్లు నేర్చుకోవడం లేదు

గత విదేశీ పర్యటనల నుంచి భారత బౌలర్లు ఏమీ నేర్చుకోవడం లేదని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ విమర్శించారు.

గవాస్కర్ వ్యాఖ్య
 
బ్రిస్బేన్: గత విదేశీ పర్యటనల నుంచి భారత బౌలర్లు ఏమీ నేర్చుకోవడం లేదని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ విమర్శించారు. టెస్టు సిరీస్‌తో పాటు వన్డేల్లోనూ బౌలర్ల ప్రదర్శన బాగాలేదని ధ్వజమెత్తారు. ‘గత కొన్నేళ్లుగా విదేశాల్లో వన్డే క్రికెట్ ఆడుతున్నారు. కానీ ఆ అనుభవం నుంచి బౌలర్లు ఏమాత్రం నేర్చుకోవడం లేదు. ఇది ఆందోళ చెందాల్సిన అంశం. ప్రపంచకప్‌కు సమయం దగ్గరపడుతోంది.

టైటిల్ నిలబెట్టుకోవాలంటే సరైన ప్రోత్సాహం అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో బౌలర్లు కేవలం బౌలింగ్ మాత్రమే చేస్తున్నారనిపిస్తోంది. ఈ సుదీర్ఘ పర్యటనలో వాళ్లు నేర్చుకున్నదేమీ కనిపించడం లేదు’ అని సన్నీ పేర్కొన్నారు. అయితే ముక్కోణపు సిరీస్‌లో ఇంగ్లండ్ ప్రదర్శనను భారత్ స్ఫూర్తిగా తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  ఓపెనర్లుగా ఎవరు వచ్చినా కోహ్లిని నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement