డిఫెండింగ్‌ చాంపియన్‌ సైనాకు షాక్ | Sun Yu beats Saina Nehwal in the Australian Open Super Series quarters | Sakshi
Sakshi News home page

డిఫెండింగ్‌ చాంపియన్‌ సైనాకు షాక్

Jun 23 2017 5:31 PM | Updated on Sep 5 2017 2:18 PM

డిఫెండింగ్‌ చాంపియన్‌ సైనాకు షాక్

డిఫెండింగ్‌ చాంపియన్‌ సైనాకు షాక్

ఆస్ట్రేలియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో మరో హైదరాబాద్ ప్లేయర్‌కు చుక్కెదురైంది.

సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో మరో హైదరాబాద్ ప్లేయర్‌కు చుక్కెదురైంది. మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్ లో భాగంగా జరిగిన శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ సైనా నెహ్వాల్(భారత్) పై 21-17, 10-21, 21-17 తేడాతో సున్ యు (చైనా) విజయం సాధించింది. ఈ విజయంతో భారత స్టార్ షట్లర్ ఇంటిదారి పట్టగా, నెగ్గిన చైనా క్రీడాకారణి సెమీస్‌లోకి దూసుకెళ్లింది.

తొలి గేమ్‌ను కోల్పోయిన సైనా రెండో గేమ్‌లో ప్రత్యర్ధి సున్ యుకు గట్టి పోటీనిచ్చింది. రెండో గేమ్‌ నెగ్గిన సైనా మూడో గేమ్‌లో కొన్ని అనవసరం తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకుని ఓటమి పాలైంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన సైనాతో పాటు మరో క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన పీవీ సింధు ఇంటిదారి పట్టారు. పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్స్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement