రూ. 16,347 కోట్లకు ప్రసార హక్కులు

రూ. 16,347 కోట్లకు ప్రసార హక్కులు - Sakshi


ముంబై: రాబోవు ఐదేళ్ల కాలానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మీడియా హక్కుల్ని స్టార్ ఇండియా దక్కించుకుంది. ఈ మేరకు సోమవారం జరిగిన వేలంలో  రూ. 16, 347 కోట్ల రికార్డు ధర తో ఐపీఎల్ మీడియా హక్కుల్ని స్టార్ ఇండియా సొంతం చేసుకుంది. ఇందులో ఇండియా బ్రాడ్ కాస్టింగ్, ఇండియా డిజిటల్ హక్కులతో పాటు అంతర్జాతీయ బ్రాడ్ కాస్టింగ్, డిజిటల్ హక్కుల్ని కూడా స్టార్ ఇండియా దక్కించుకుంది. ఏడాదికి రూ.3,270 కోట్ల చొప్పన స్టార్ ఇండియా చెల్లించనుంది. దీనిలో భాగంగా 2018 నుంచి 2022 వరకు ఐపీఎల్ 'బ్రాడ్ కాస్టింగ్' హక్కులు స్టార్ ఇండియా వద్ద ఉండనున్నాయి. దాదాపు 20 ప్రముఖ కంపెనీలు వేలంలో పాల్గొనగా వాటిని స్టార్ ఇండియా వెనక్కునెట్టి మరీ మీడియా హక్కుల్ని కైవసం చేసుకుంది.





ఈ వేలంలో స్టార్‌ ఇండియాతో పాటు సోనీ నెట్‌వర్క్, అమెజాన్‌ సెల్లర్‌ సర్వీసెస్, ఫాలోఆన్‌ ఇంటరాక్టివ్‌ మీడియా, తాజ్‌ టీవీ ఇండియా, టైమ్స్‌ ఇంటర్నెట్, సూపర్‌స్పోర్ట్‌ ఇంటర్నేషనల్, రిలయన్స్‌ జియో డిజిటల్, గల్ఫ్‌ డీటీహెచ్, గ్రూప్‌ ఎమ్‌ మీడియా, బెల్‌ ఎన్‌ ఈకోనెట్‌ మీడియా, సై యూకే, ఈఎస్‌పీఎన్‌ డిజిటల్‌ మీడి యా, బీటీజీ లీగల్‌ సర్వీసెస్, బీటీ పీఎల్‌సీ, ట్విట్టర్, ఫేస్‌బుక్‌ తదితర సంస్థలు పోటీ పడ్డాయి. ఐపీఎల్‌ తొలినాళ్లలో పదేళ్ల కాలానికి సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్‌ రూ. 8200 కోట్లు వెచ్చించి టీవీ హక్కులు పొందింది. డిజిటల్‌ హక్కులను గత మూడేళ్ల (2015–17) కాలానికి నోవి డిజిటల్‌ సంస్థ రూ. 302.2 కోట్లతో చేజిక్కించుకుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top