శ్రీకాంత్‌ ఘనవిజయం | Srikanth beats Chaitanya Kumar in Wrestling Championship | Sakshi
Sakshi News home page

శ్రీకాంత్‌ ఘనవిజయం

Mar 23 2018 10:57 AM | Updated on Mar 23 2018 10:57 AM

Srikanth beats Chaitanya Kumar in Wrestling Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సుభాష్‌ చంద్రబోస్, శివలాల్‌ ఎమ్మెల్యే రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో పి. శ్రీకాంత్‌ ముందంజ వేశాడు. ధూల్‌పేట్‌లోని కులీ కుతుబ్‌షా మినీ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్‌ ఘనవిజయం సాధించాడు. 55కేజీల వెయిట్‌ కేటగిరీలో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్‌ (గణేశ్వర్‌ ఉస్తాద్, కార్వాన్‌) 10–2తో ఎస్‌. చైతన్య కుమార్‌ (బాబయ్య ఉస్తాద్‌)పై విజయం సాధించాడు.

ఇతర మ్యాచ్‌ల్లో సి. విశ్వనాథ్‌ (మనోజ్‌ ఉస్తాద్‌) 8–2తో జి. అక్షయ్‌పై, జె. రాజు (ఆమ్లేపూర్‌) 8–2తో మోంటు (లక్ష్మీపతి వ్యాయామశాల)పై, శ్యామ్‌ సింగ్‌ (గోవింద్‌ రామ్‌ ఉస్తాద్‌) 10–4తో ఎస్‌. కరణ్‌ సింగ్‌ (రెస్లీ అకాడమీ)పై విజయం సాధించి ముందంజ వేశారు.   

 

Advertisement
 
Advertisement
Advertisement