శ్రీలంక క్రికెటర్‌పై 6 మ్యాచ్‌ల నిషేదం! | Sri Lankan Cricketer Danushka Gunathilaka Banned for 6 International Matches | Sakshi
Sakshi News home page

Jul 27 2018 5:07 PM | Updated on Jul 27 2018 5:07 PM

Sri Lankan Cricketer Danushka Gunathilaka Banned for 6 International Matches - Sakshi

గుణతిలక

గుణతిలక బస చేసిన హోటల్‌ గదిలో అతడి స్నేహితుడొకరు ఓ నార్వే మహిళపై అత్యాచారం జరిపినట్లు ఆరోపణలు

కొలంబో : శ్రీలంక ఓపెనర్‌ ధనుష్క గుణతిలకపై ఆ దేశ క్రికెట్‌ బోర్డు 6 అంతర్జాతీయ మ్యాచ్‌ల ఆడకుండా నిషేదం విధించింది. ఇటీవల ఈ క్రికెటర్‌ శ్రీలంక బోర్డు ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్‌ సందర్భంగా అతని చర్యలను సీరియస్‌గా పరిగణించింది. ఆ టెస్టు సంబంధించిన ఫీజుల, బోనస్‌లను ఇవ్వలేదని ప్రకటించింది.

మొత్తం ఆరు మ్యాచ్‌ల నిషేధంలో తాజా ఉల్లంఘన కారణంగా మూడు మ్యాచ్‌లు వేటు వేయగా.. అక్టోబర్ 18, 2017లో ప్లేయర్ కాంట్రాక్టును ఉల్లంఘించిన ఏడాదిలోపే మరోసారి నిబంధనలు అతిక్రమించాడని మరో మూడు మ్యాచ్‌లు సస్పెన్షన్ విధించింది. గుణతిలక బస చేసిన హోటల్‌ గదిలో అతడి స్నేహితుడొకరు ఓ నార్వే మహిళపై అత్యాచారం జరిపినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన శ్రీలంక క్రికెట్ బోర్డు గుణతిలకపై దర్యాప్తునకు ఆదేశించింది. శ్రీలంక జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ప్రవర్తనా నియమావళిని పదేపదే ఉల్లంఘించడంతో కఠిన చర్యలు తీసుకుంది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో గుణతిలక చక్కటి ప్రదర్శన చేశాడు.

చదవండి: క్రికెటర్‌ గదిలో అత్యాచారం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement