స్మిత్‌ లాగే... పెరీరా! | Sri Lanka back Dilruwan Perera over DRS controversy, deny breach of rules | Sakshi
Sakshi News home page

స్మిత్‌ లాగే... పెరీరా!

Nov 20 2017 3:54 AM | Updated on Nov 20 2017 3:54 AM

Sri Lanka back Dilruwan Perera over DRS controversy, deny breach of rules - Sakshi

ఇటీవలే భారత్‌ పర్యటనలో ఆసీస్‌ కెప్టెన్‌ స్మిత్‌ మాదిరిగానే శ్రీలంక బ్యాట్స్‌మన్‌ దిల్‌రువాన్‌ పెరీరా కూడా డీఆర్‌ఎస్‌ కోసం పెవిలియన్‌ను ఆశ్రయించాడు. అయితే కోహ్లి సేన నుంచి అభ్యంతరం లేకపోవడంతో మొత్తానికి ఇదేమంత వివాదం కాలేదు. షమీ వేసిన 57వ ఓవర్‌ చివరి బంతికి పెరీరా ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. నాన్‌ స్ట్రయిక్‌ ఎండ్‌లో హెరాత్‌ను సంప్రదిస్తూనే వెనుదిరిగాడు. అయితే డ్రెస్సింగ్‌ రూమ్‌వైపు చూసి ఉన్నపళంగా ఆగి... రివ్యూ కోరడం చర్చనీయాంశమైంది. రీప్లేలో నాటౌట్‌గా తేలడంతో అతను ఓ 5 పరుగులు చేసేశాడు. ఈ ఘటనతో డీఆర్‌ఎస్‌ మళ్లీ డ్రెస్సింగ్‌ రూమ్‌ సమీక్షా పద్ధతైంది!

చూశాడేమో కానీ...
తమ ఆటగాడు డ్రెస్సింగ్‌ రూమ్‌ వైపు చూశాడేమో కానీ... రివ్యూపై సాయం కోరలేదని, సంజ్ఞలేవీ చేయలేదని లంక బోర్డు (ఎస్‌ఎల్‌సీ) వివరణ ఇచ్చింది. 

ఆసీస్‌ కెప్టెన్‌ స్మిత్‌

Advertisement
 
Advertisement
Advertisement