లియోనల్‌ మెస్సీకి జైలు శిక్ష | Spain Supreme Court confirms Messi fraud sentence | Sakshi
Sakshi News home page

లియోనల్‌ మెస్సీకి జైలు శిక్ష

May 24 2017 6:26 PM | Updated on Sep 5 2017 11:54 AM

లియోనల్‌ మెస్సీకి జైలు శిక్ష

లియోనల్‌ మెస్సీకి జైలు శిక్ష

అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్‌ ప్లేయర్ లియోనల్ మెస్సీకి జైలు శిక్ష పడింది. పన్ను ఎగవేత మోసం కేసులో 21నెలల జైలు శిక్ష విధించడంతోపాటు దాదాపు రూ.15 కోట్లు జరిమానా విధిస్తూ స్పెయిన్‌ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

మ్యాడ్రిడ్‌: అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్‌ ప్లేయర్ లియోనల్ మెస్సీకి జైలు శిక్ష పడింది. పన్ను ఎగవేత మోసం కేసులో 21నెలల జైలు శిక్ష విధించడంతోపాటు దాదాపు రూ.15 కోట్లు జరిమానా విధిస్తూ స్పెయిన్‌ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 2016లోనే జూలైలో మెస్సీకి జైలు శిక్ష పడింది.

అయితే, తొలిసారి చేసిన అహింసతో కూడిన నేరానికి రెండేళ్ల కంటే తక్కువ శిక్షపడితే అది సాధారణంగానే సస్పెండ్‌ అవుతుంది. పన్ను ఎగవేత కేసులో అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ, అతని తండ్రి జార్జ్ హోరాసియో మెస్సీని బార్సిలోనా కోర్టు దోషులుగా తేల్చిన విషయం తెలిసిందే. బార్సిలోనా కోర్టు విధించిన శిక్షను స్పెయిన్ సుప్రీంకోర్టులో మెస్సీ, జార్జ్‌లు అప్పీలు చేయగా సుప్రీంకోర్టు కూడా బార్సిలోనా కోర్టును సమర్థించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement