పటిష్ట స్థితిలో దక్షిణాఫ్రికా

South Africa vs Pakistan 3rd Test Day 1 in Johannesburg - Sakshi

జొహన్నెస్‌బర్గ్‌: పాకిస్తాన్‌పై మూడో టెస్టులోనూ దక్షిణాఫ్రికా తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ ఆధిక్యాన్ని 212 పరుగులకు పెంచుకుంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 17/2తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాకిస్తాన్‌ పేస్‌ బౌలర్లు ఒలివియర్‌ (5/51), ఫిలాండర్‌ (3/43) ధాటికి 49.4 ఓవర్లలో 185 పరుగులకే కుప్పకూలింది. సర్ఫరాజ్‌ అహ్మద్‌ (40 బంతుల్లో 50; 8 ఫోర్లు), బాబర్‌ ఆజమ్‌ (55 బంతుల్లో 49; 10 ఫోర్లు) దూకుడగా ఆడటం విశేషం. పాకిస్తాన్‌ ఇన్సింగ్స్‌లో అందరూ క్యాచ్‌ ఇచ్చి ఔట్‌ కావడం మరో విశేషం. 77 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన దక్షిణాఫ్రికా శనివారం ఆట ముగిసే సమయానికి 37 ఓవర్లలో 5 వికెట్లకు 135 పరుగులు చేసింది. హషీమ్‌ ఆమ్లా (42 బ్యాటింగ్‌; 8 ఫోర్లు), క్వింటన్‌ డి కాక్‌ (34 బ్యాటింగ్‌; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top