తొలి టి20లో దక్షిణాఫ్రికా విజయం | South Africa victory in the first T20 | Sakshi
Sakshi News home page

తొలి టి20లో దక్షిణాఫ్రికా విజయం

Aug 16 2015 12:48 AM | Updated on Sep 3 2017 7:30 AM

న్యూజిలాండ్‌తో రెండు టి20ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆరు వికెట్లతో విజయం సాధించింది

డర్బన్: న్యూజిలాండ్‌తో రెండు టి20ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆరు వికెట్లతో విజయం సాధించింది. కింగ్స్‌మీడ్ మైదానంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత న్యూజి లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 151 పరుగులు చేసింది. ఓపెనర్లు గప్టిల్ (42), విలియమ్సన్ (42) మినహా అందరూ విఫలమయ్యారు. రబడ, వీస్, ఫాంగిసో రెండేసి వికెట్లు తీశారు. సఫారీ జట్టు 17.5 ఓవర్లలో 4 వికెట్లకు 152 పరుగులు చేసి గెలిచింది. ఆమ్లా (48), డివిలియర్స్ (33), రోసో (38) రాణించారు. ఇరు జట్ల మధ్య రెండో టి20 నేడు (ఆదివారం)జరుగుతుంది.
 
 న్యూజిలాండ్ x దక్షిణాఫ్రికా
 రెండో టి20, సెంచూరియన్
 సా. గం. 5.30 నుంచి
 టెన్ క్రికెట్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement