చివరి వన్డేలో భారత్‌ ఓటమి

South Africa Under 19 Team Won The Last  ODI Match - Sakshi

ఈస్ట్‌ లండన్‌ (దక్షిణాఫ్రికా): దక్షిణాఫ్రికా అండర్‌–19 జట్టుతో జరిగిన చివరిదైన మూడో అనధికారిక వన్డేలో భారత అండర్‌–19 జట్టు ఐదు వికెట్లతో ఓడింది. అయితే ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండా యువ భారత్‌ 2–1 సిరీస్‌ను సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 192 పరుగులు చేసింది. ప్రియం గార్గ్‌ (52; 6 ఫోర్లు) రాణించాడు. అనంతరం ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 48.2 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 193 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. జొనాథన్‌ బర్డ్‌ (88 నాటౌట్‌; 9 ఫోర్లు, సిక్స్‌) జట్టుకు విజయాన్ని అందించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top