విజేతలు సోహన్‌– విక్రమ్‌ | Sohan And Vikram Won Titles of Sports Quiz | Sakshi
Sakshi News home page

విజేతలు సోహన్‌– విక్రమ్‌

May 16 2019 9:53 AM | Updated on May 16 2019 9:53 AM

Sohan And Vikram Won Titles of Sports Quiz - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) వేసవి క్రీడా శిబిరాల్లో భాగంగా నిర్వహించిన స్పోర్ట్స్‌ క్విజ్‌లో బి.సోహన్‌–జి. విక్రమ్‌ దేవ్‌ ఆకట్టుకున్నారు. జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ జోన్‌లో భాగంగా విక్టరీ ప్లేగ్రౌండ్‌లో నిర్వహించిన ఈ పోటీలో సోహన్‌– విక్రమ్‌ దేవ్‌ (వీపీజీ బాక్సింగ్‌ టీమ్‌) విజేతలుగా నిలిచారు.

జీహెచ్‌ఎంసీ రహీంపురా ప్లేగ్రౌండ్‌ క్రికెట్‌ జట్టుకు చెందిన బి. సాయివరుణ్‌ గుప్తా–ప్రాంజల్‌ ఠాకూర్‌ రన్నరప్‌తో సరిపెట్టుకోగా... ఎస్‌. అభినవ్‌ యాదవ్‌–కేఎల్‌వీ కార్తికేయ (వీపీజీ టేబుల్‌ టెన్నిస్‌) మూడోస్థానంలో నిలిచారు. వీరికి షాదాన్‌ కాలేజి ప్రొఫెసర్‌ మొహమ్మద్‌ సయీద్‌ బహుమతులు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement