స్మిత్, బర్న్స్ బాదుడు | Smith, Burns hits centuries | Sakshi
Sakshi News home page

స్మిత్, బర్న్స్ బాదుడు

Feb 21 2016 3:29 PM | Updated on Sep 3 2017 6:07 PM

స్మిత్, బర్న్స్ బాదుడు

స్మిత్, బర్న్స్ బాదుడు

న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా దీటుగా స్పందిస్తోంది.

క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా దీటుగా స్పందిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు కోల్పోయి 363 పరుగులు చేసింది. కివీస్ కంటే 7 పరుగులు వెనుకబడి ఉంది. 57/1 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ మరో 3 వికెట్లు నష్టపోయి 306 పరుగులు జోడించింది.

ఓపెనర్ బర్న్స్(170), కెప్టెన్ స్మిత్(138) సెంచరీలతో చెలరేగారు. వార్నర్ 12, ఉస్మాన్ ఖాజా 24 పరుగులు చేసి అవుటయ్యారు. వోజెస్(2), లియన్(4) క్రీజ్ లో ఉన్నారు. కివీస్ బౌలర్లలో వాగ్నర్, బౌల్ట్ రెండేసి వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 370 పరుగులు చేసింది. మెకల్లమ్ సెంచరీతో (79 బంతుల్లో 145; 21 ఫోర్లు, 6 సిక్సర్లు) రికార్డు సృష్టించాడు.

Advertisement
 
Advertisement
Advertisement