ఐదు ఓవర్లు.. ఆరు వికెట్లు! | Six wickets in five overs | Sakshi
Sakshi News home page

ఐదు ఓవర్లు.. ఆరు వికెట్లు!

May 29 2017 4:14 PM | Updated on Sep 5 2017 12:17 PM

ఐదు ఓవర్లు.. ఆరు వికెట్లు!

ఐదు ఓవర్లు.. ఆరు వికెట్లు!

మూడు వన్డేల సిరీస్ లో భాగంగా లార్డ్స్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి మ్యాచ్ లో ఇంగ్లండ్ విలవిల్లాడుతోంది.

లండన్: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా లార్డ్స్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి మ్యాచ్ లో ఇంగ్లండ్ విలవిల్లాడుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 20 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దక్షిణాఫ్రికా పేసర్లు విజృంభించడంతో ఇంగ్లండ్ టాపార్డర్ వరుస పెట్టి పెవిలియన్ కు క్యూకట్టేసింది. జాసన్ రాయ్(4), అలెక్స్ హేల్స్(1),జో రూట్(2), ఇయాన్ మోర్గాన్(8), బట్లర్(4),ఆదిల్ రషిద్(0)లు ఇలా వచ్చి అలా పెవిలియన్ కు చేరారు. ఇంగ్లండ్ కోల్పోయిన ఆరు వికెట్లలో రబడా నాలుగు వికెట్లు సాధించగా, పార్నెల్ రెండు వికెట్లు తీశారు.

ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జాసన్ రాయ్ ను రబడా పెవిలియన్ కు పంపి  ఇంగ్లండ్ కు షాకిచ్చాడు. అనంతరం మూడు పరుగుల వ్యవధిలో రూట్ కూడా రబడా బౌలింగ్ లోనే అవుట్ కావడంతో ఇంగ్లండ్ 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆపై మోర్గాన్, హేల్స్, బట్లర్, రషిద్లు స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో ఇంగ్లండ్ ఐదు ఓవర్లలోపే ఆరు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇప్పటికే సిరీస్ ను 2-0తో  ఇంగ్లండ్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement