సింధు సంచలనం | Sindhu sensation | Sakshi
Sakshi News home page

సింధు సంచలనం

Oct 17 2015 1:41 AM | Updated on Sep 3 2017 11:04 AM

సింధు సంచలనం

సింధు సంచలనం

డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత....

ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ పీవీ సింధు సంచలనం సృష్టించింది. ప్రపంచ నాలుగో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ హైదరాబాద్ అమ్మాయి ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. కేవలం 34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ సింధు 21-12, 21-15తో తై జు యింగ్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.

గతంలో తై జు యింగ్ చేతిలో మూడుసార్లు ఓడిపోయిన సింధు ఈసారి ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. రెండు గేముల్లోనూ ఆరంభంలో కాస్త పోటీ ఎదుర్కొన్న సింధు మ్యాచ్ సాగుతున్నకొద్దీ పైచేయి సాధించింది. క్వార్టర్ ఫైనల్లో మాజీ నంబర్‌వన్ యిహాన్ వాంగ్ (చైనా)తో సింధు ఆడుతుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement