మామిడి పండు తింటే నోరంతా తీపి, చేతులంతా రసం, చివరికి మిగిలేది పెద్ద టెంక కదా. మరి టెంకే లేని మామిడి పండు ఉందా? ఉంది! దాని పేరే ‘సింధు మామిడి’. ఇది పూర్తిగా మన ఇండియా సైంటిస్టుల మ్యాజిక్. మహారాష్ట్రలోని కొంకణ్ కృషి విద్యాపీఠ్‌లో శాస్త్రవేత్తలు టెంకె లేకుండా తయారు చేసిందే ఈ సింధు.
ఈ పండులో టెంక ఉండదు. ఉన్నా అది కాగితంలా పల్చగా, కేవలం ఆరు గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. టెంక లేదు కాబట్టి పండులో డెబ్బై నుంచి ఎనభై శాతం కమ్మటి గుజ్జే ఉంటుంది. పీచు అసలే ఉండదు. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది.
పండు సగటు బరువు రెండు వందల గ్రాములు. పసుపు రంగులో మెరిసిపోతూ ఉంటుంది. జూలై నెలలో పండుతుంది. గుత్తులు గుత్తులుగా కాస్తుంది. జ్యూస్, ఐస్‌క్రీం, మామిడి తాండ్ర చేయడానికి ఇది బెస్ట్. ఇప్పుడు బీహార్, మహారాష్ట్ర రైతులు దీన్ని పండిస్తున్నారు. విదేశాలకు కూడా పంపుతున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం బట్టి చూస్తే మనదేశంలో కిలో రూ. 500 వరకు అమ్ముతున్నట్టు తెలుస్తోంది.


