జ్వాల కొత్త క్రీడా అకాడమీ

Shuttler Jwala Gutta To Open Her Own Sports Academy In Hyderabad - Sakshi

న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఆధ్వర్యంలో కొత్త క్రీడా అకాడమీ ప్రారంభం కానుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని సుజాత హైసూ్కల్‌ ప్రాంగణంలో ఈ అకాడమీని నెలకొల్పారు. గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఈ అకాడమీలో 14 బ్యాడ్మింటన్‌ కోర్టులు, అత్యాధునిక జిమ్నాజియం ఉన్నాయి. ఈ అకాడమీలో బ్యాడ్మింటన్‌తోపాటు క్రికెట్, స్విమ్మింగ్‌ క్రీడాంశాల్లోనూ శిక్షణ ఇస్తారు. అకాడమీకి సంబంధించిన లోగోను మంగళవారం న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారత స్టార్‌ రెజ్లర్, బీజింగ్, లండన్‌ ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన సుశీల్‌ కుమార్‌... భారత ప్రొఫెషనల్‌ బాక్సర్‌ విజేందర్‌ సింగ్, పార్లమెంట్‌ సభ్యుడు రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ పాల్గొన్నారు.

‘భారత్‌ ఎంతో పెద్ద దేశం. కానీ మనకు బ్యాడ్మింటన్‌లో సైనా, సింధు మాత్రమే ఉన్నారు. ఈ సంఖ్య పెరగాలి. జ్వాల అకాడమీ ద్వారా చాంపియన్లను తయారు చేయాలని అనుకుంటున్నాను. నా అకాడమీకి మద్దతు ఇవ్వాలని కోరుతూ కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజును కలిశాను. ఆయన నుంచి సానుకూల స్పందన వచి్చంది. అకాడమీ నిర్మాణం కోసం ఎవరి సహాయం తీసుకోలేదు. సొంతంగా ఏర్పాటు చేశాను. నా అకాడమీలో కనీసం 10 మంది కోచ్‌లు ఉంటారు. అందులో ఇద్దరు విదేశీ కోచ్‌లు’ అని జ్వాల వివరించింది. వచ్చే నెలలో అధికారికంగా ప్రారంభమయ్యే ఈ అకాడమీలో చేరాలనుకునే వారికి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. వివరాలకు 8826984583, 9811325251 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలి.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top