మాలిక్‌కు ఊరట | Shoaib Malik relieved his bowling action not reported | Sakshi
Sakshi News home page

మాలిక్‌కు ఊరట

Nov 4 2014 12:16 AM | Updated on Mar 23 2019 8:48 PM

మాలిక్‌కు ఊరట - Sakshi

మాలిక్‌కు ఊరట

కరాచీ: పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ బౌలింగ్‌పై తమకు ఎటువంటి ఫిర్యాదులు రాలేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది.

కరాచీ: పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ బౌలింగ్‌పై తమకు ఎటువంటి ఫిర్యాదులు రాలేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. పాకిస్థాన్ దేశవాళీ ట్రోఫీ ‘కైద్-ఎ-ఆజమ్’లో జెడ్‌టీబీఎల్ జట్టుకు నేతృత్వం వహిస్తున్న మాలిక్ బౌలింగ్ యాక్షన్‌పై కొద్ది రోజుల క్రితం అంపైర్లు అనుమానం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కరాచీ డాల్ఫిన్స్‌తో జెడ్‌టీబీఎల్ మ్యాచ్ అనంతరం మాలిక్ యాక్షన్‌ను అంపైర్లు పరిశీలించి ఎలాంటి తప్పు లేదని తేల్చారని పీసీబీ తెలిపింది. తన బౌలింగ్  యాక్షన్‌పై ఎటువంటి ఆరోపణలు రాలేదన్న విషయంపై మాలిక్ ఆనందం వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement