పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికాడు.
షార్జా: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఇంగ్లండ్తో షార్జాలో జరుగుతున్న టెస్టు మ్యాచ్ అతనికి ఆఖరిది. ఈ మ్యాచ్ మూడో రోజు మంగళవారం ఆట అనంతరం షోయబ్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు.
పాక్ జట్టులో కొందరు ప్రతిభావంతులైన యువ క్రికెటర్లున్నారని, తాను వైదొలగడానికి ఇదే సరైన సమయమని షోయబ్ భావోద్వేగంతో చెప్పాడు. షోయబ్ తన కెరీర్లో 35 టెస్టులు ఆడాడు. ఇంగ్లండ్ తో తాజా మ్యాచ్ గాక గత 34 టెస్టుల్లో 3 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలతో సహా 1860 పరుగులు చేశాడు. 25 వికెట్లు తీశాడు.