మెయిన్ ‘డ్రా’కు రుత్విక | Shivani rutvika Badminton Tournament Draw | Sakshi
Sakshi News home page

మెయిన్ ‘డ్రా’కు రుత్విక

Mar 30 2016 12:46 AM | Updated on Sep 3 2017 8:49 PM

ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి గద్దె రుత్విక శివాని మహిళల సింగిల్స్ విభాగంలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది.

 న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి గద్దె రుత్విక శివాని మహిళల సింగిల్స్ విభాగంలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో రుత్విక అజేయంగా నిలిచింది. తొలి రౌండ్‌లో రుత్విక 21-9, 21-16తో మరో తెలుగమ్మాయి గుమ్మడి వృశాలిని ఓడించగా... రెండో రౌండ్‌లో 21-16, 21-18తో గ్రేస్ గేబ్రియల్ (నైజిరియా)పై గెలిచింది. రుత్వికతోపాటు భారత్‌కే చెందిన తన్వీ లాడ్, రితూపర్ణ దాస్, అరుణ ప్రభుదేశాయ్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందారు. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో భారత్ నుంచి సౌరభ్ వర్మ ఒక్కడే మెయిన్ ‘డ్రా’కు చేరుకున్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement