
సాక్షి, స్పోర్ట్స్ : భారత బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్‌పై పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు ప్రశంశలు కురిపిస్తున్నారు. భారత్‌కి ఎల్లపుడు ప్రత్యర్థిగా ఉండే పాకిస్థాన్ అభిమానుల నుంచి ప్రశంశలు ఏంటి అనుకుంటున్నారా.? గత బుధవారం న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో ఫీల్డర్ విసిరిన బంతి నేరుగా తలకు తగలడంతో పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన విషయం తెలిసందే. ఈ విషయంపై ధావన్ షోయబ్ మాలిక్ యోగక్షేమాలను కోరుతూ తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్ ‘నేను తొందరగా కోలుకుంటానని, ఆ నమ్మకం నాకు ఉందని, ఆ అల్లా నన్ను కాపాడతాడు’అని ట్వీట్ చేశాడు. దీనికి బదులుగా శిఖర్ ధావన్ ‘నువ్వు తొందరగా కోలుకుని పిచ్‌లో అడుగుపెట్టాలని, జాగ్రత్త’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో పాకిస్థాన్ అభిమానులు ధావన్ ట్వీట్‌కు ‘మీరు గ్రేట్ అని, లవ్యూ ధావన్’ అంటూ బదులిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టుకు శిఖర్ ధావన్‌ను పక్కనపెట్టిన విషయం తెలిసిందే.
Janab @realshoaibmalik, hope you're recovering well and will be fit soon to be back on the field! Take care🤗☺
— Shikhar Dhawan (@SDhawan25) January 18, 2018